Monday, December 23, 2024

కుకునూరుపల్లిలో కుక్కల దాడి..

- Advertisement -
- Advertisement -

కొండపాక (కుకునూరుపల్లి): మండల పరిధిలోని కుకునూరుపల్లి, ముద్దాపూర్ గ్రామాల్లో ఊర కుక్కలు దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచాయి. కుకునూరుపల్లిలో సుమారు పది మందికి గాయాలు కాగా ముద్దాపూర్‌లో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.వీరిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుకునూరుపల్లి గ్రామానికి చెందిన సుజాత, గంగిశెట్టి పండరి, మంద సత్తయ్య, లక్ష్మణరావులతో పాటు పలువురికి గాయాలయ్యాయి.

గజ్వేల్ మండలం ఆక్కారం గ్రామానికి చెందిన శ్రీకృతి అనే బాలిక వారి అమ్మమ్మ గ్రామమైన ముద్దాపూర్ కు వచ్చింది. బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రెండు గ్రామాల్లో సుమారు పది మంది కుక్కల దాడిలో గాయాలయ్యారు. కుక్కల బెడదను తొలగించాలని గ్రామస్ధులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News