అమెరికాలోని న్యూ ఓలియన్స్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు వాహనం నుంచి దిగి
కాల్పులు జరిపిన దుండగుడు 10మంది మృతి, 30మందికిపైగా గాయాలు
న్యూయార్క్ : నూతన సంవత్సరాది వేళ అమెరికాలో వి షాద ఘటన చోటు చేసుకున్నది. ఒక వాహనం జనంపైకి దూసుకుపోయిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరి 30 మంది గాయపడ్డారు. బుధవారం తె ల్లవారు జామున సుమారు 3.15 గంటలకు న్యూ ఓ లియన్స్‌లో బౌర్బన్ స్ట్రీట్, ఇబెర్‌వెల్లి కూడలిలో ఈ ఘ టన జరిగింది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, వాహనం అమిత వేగంతో జనంపైకి దూసుకుపోయింది,
డ్రైవర్ వాహనంలో నుంచి దిగి కాల్పులు ప్రారంభించా డు. అనుమానితునితో పోలీసులు కాల్పుల పోరు సాగించారని సాక్షులు చెప్పినట్లు ‘సిబిఎస్ న్యూస్’ తెలియజేసిం ది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద ర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, సోష ల్ మీడియా పోస్ట్‌లు ఆ ప్రదేశంలో భారీ ఎత్తున రక్షణ, సహాయక చర్యల హడావిడిని వెల్లడించాయి. పోలీస్ కా ర్లు, అంబులెన్స్‌లు, కరోనర్ కార్యాలయం నుంచి వాహనాలు ఆ కూడలి చుట్లూ చేరినట్లు వీడియో ఫుటేజ్, ఫో టోలు సూచిస్తున్నాయి. కాగా, నష్టం తీవ్రత మదింపున కు అధికారులు ప్రయత్నిస్తున్నారు.