Wednesday, January 22, 2025

ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొని 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్‌లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనాన్ని వేగంగా దూసుకువచ్చి ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ జిల్లాలో రాజ్‌కోట్‌అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బగోదర గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని డిఎస్‌పి అమిత్ వాసవ చెప్పారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సురేంద్రనగర్ జిల్లా లోని చోటిలాలోదైవ దర్శనం చేసుకుని తిరిగి అహ్మదాబాద్ వైపు మినీ ట్రక్కులో తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులను తరలించే ట్రక్కు కాదిది. అయినాసరే 23 మందిని తీసుకువెళ్తోంది. ప్రమాదంలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారు అంతా ఖేదా జిల్లా కపడవంజ్ తాలూకా లోని గ్రామానికి చెందినవారు.
ప్రధాని మోడీ తీవ్ర సంతాపం
ఈ ప్రమాద వార్త తెలిసి ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని అభిలషించారు. బాధితులకు స్థానిక అధికార యంత్రాంగం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50 వేలు సహాయం అందుతుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News