Sunday, December 22, 2024

బెంగళూరు, విజయవాడ రూట్‌లలో 10 శాతం రాయితీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ మార్గంలో టికెట్‌పై 10 శాతం రాయితీ కల్పించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో నేటినుంచి (ఆదివారం) నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసి అధికారులు తెలిపారు.

రాయితీని వినియోగించుకోవాలి
విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో ఈ 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. రానూపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50ల వరకు, బెంగళూరు మార్గంలో రూ.100ల వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుంది. ఈ రాయితీని ప్రయాణికులు వినియోగించుకోవాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండి విసి సజ్జనార్‌లు కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.comను సంప్రదించాలని వారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News