Sunday, December 22, 2024

గిరిజనులకు దసరా కానుక

- Advertisement -
- Advertisement -

కోటా పెంచుతూ జీఓ జారీ నేటి నుంచే అమలు హర్షం వ్యక్తం చేసిన గిరిజనం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డారు. గిరిజన బిడ్డలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాష్ట్ర ప్రభు త్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ నెల 17 న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు సిఎం కెసిఆర్ మాటకు కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకున్నారు. దీంతో రాష్ట్రం లో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతం రిజర్వేషన్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా వారి రిజర్వేషన్ 10శాతానికి పెం చాలని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి రాష్ట్రపతి అనుమతి కోసం కేంద్రానికి పం పింది. ఏడేండ్లు దాటినా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. ఈ బిల్లుపై కేంద్రం తన వైఖరిని నానుస్తూ వచ్చింది. ఈ నెల 17న జరిగిన ఆత్మీయ సభలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News