Monday, November 18, 2024

శ్రీలంకకు ఐసిసి షాక్

- Advertisement -
- Advertisement -

స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల ఫీజులో 10శాతం కట్

దుబాయ్ : వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన శ్రీలంక జట్టుకు ఐసిసి మరో షాక్ ఇచ్చింది. ఓటమి బాధలో ఉన్న లంక ప్లేయర్లకు జరిమానా విధించింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10శాం కోత విధిస్తూ ఆదివారం ప్రకటించింది. పరుగుల సునామీగా సాగిన ఈ పోరులో శ్రీలంక నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ 2.22 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు. నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయిన ఒక్కో ఓవర్‌కు 5 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడం పరిపాటి కాగా.. రెండు ఓవర్లకు గానూ లంక ప్లేయర్ల మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం కోత విధించారు. కాగా, ఈ మ్యాచ్‌లో లంక 102 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News