Wednesday, January 22, 2025

పారామెడికల్ కోర్సుల్లో ఇడబ్ల్యుఎస్‌కు 10% కోటా

- Advertisement -
- Advertisement -

బిపిటి, ఎంపిటి,ఎంఎస్‌సి నర్సింగ్, పిబిబిఎస్‌సి కోర్సులకు వర్తింపు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ఇప్పటికే ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, అనుబంధ హెల్త్ కోర్సుల్లో అమలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇడబ్ల్యుఎస్‌ కు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ వర్తించనుండగా.. బిపిటి, ఎంపిటి, ఎంఎస్‌సి నర్సింగ్, పిబిబిఎస్‌సి(నర్సింగ్) కోర్సులకు ఈ రిజర్వేషన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఆదేశించింది. తాజా నిర్ణయంతో బిపిటిలో 69 సీట్లు, ఎంపిటి 6 సీట్లు, ఎంఎస్‌సి నర్సింగ్‌లో 25 సీట్లు, పిబిబిఎస్‌సి నర్సింగ్‌లో 23 సీట్లు ఇడబ్లూఎస్ కోటా కింద రిజర్వ్ కానున్నాయి.

ఇప్పటికే ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, అనుబంధ హెల్త్ సైన్స్, బిఎస్‌సి నర్సింగ్ సీట్లలో 10 శాతం రిజ్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎంబిబిఎస్‌లో 203 సీట్లు, ఇతర పారామెడికల్ కోర్సుల్లోని కాంపిటేంట్ కోటాలో 648 సీట్లు రిజర్వ్ అవుతాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభు త్వం 10 శాతం ఇడబ్లూఎస్ రిజర్వేషన్లు కేటాయింపు నిర్ణయం తీసుకున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News