Thursday, December 19, 2024

అమెరికాలో విచక్షణారహితంగా కాల్పులు.. 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శనివారం న్యూయార్క్ లోని సూపర్ మార్కెట్ లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సైనిక దుస్తులు, కెమెరా హెల్మెంట్ ధరించి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని, జాతివిద్వేషమే కారణంగా కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

10 Shot dead in Firing at Super Market in US 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News