- Advertisement -
అనంతగిరి ః మధ్యాహ్నం భోజనంలో కనీస పరిశుభ్రతను పాటించకుండా, పురుగుల బియ్యం ఉపయోగించి వండిన ఆహారాన్ని తిన్న పది మంది విద్యార్థులు అస్వస్థతతకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం … మధ్యాహ్నం భోజనంలో బియ్యాన్ని కడగకుండా, పురుగులను వేరుచేయకుండా వంట చేశారు. ఆ భోజనాన్ని తిన్న విద్యార్థులకు వాంతులు అయ్యాయి. కూరగాయల్లో పురుగులు ఉన్నా పారేయకుండా వండి పెడుతున్నారని, దానిని ఉపాధ్యాయులు కూడా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వలన ఈ ఘటన జరిగిందని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయులు, సమయపాలన పాటించడం లేదని, ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
- Advertisement -