న్యూయార్క్ : ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఇ-కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మందిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, వచ్చే వారంలో అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. గత కొన్ని త్రైమాసికాలుగా సంస్థ లాభాలు ఆశించిన మేరకు రాకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక మాంద్యం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. కంపెనీ గత వారం కూడా హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించింది. అయితే అమెజాన్ నుండి ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వచ్చే ఐదేళ్లలో ప్యాకేజింగ్ 100 శాతం రోబోటిక్ సిస్టమ్‌గా మారుతుందని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టై బ్రాడీ చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో రోబోలు వస్తాయని, దీనికి చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. కంపెనీలో పని ఖచ్చితంగా మారుతుందని, కానీ మానవ అవసరం ఎప్పుడూ ఉంటుందని బ్రాడీ అన్నారు.