- Advertisement -
మూనక్ : పంజాబ్‌లో ఘగ్గర్ నదిపై ఉన్న మూనక్ వద్ద ఓ ఆనకట్ట మూడు చోట్ల దెబ్బతింది. పుల్లాడు, మక్రౌడ్, చందు వద్ద ఆనకట్టకు గండ్లు పడ్డాయి. ఘగ్గర్ నది ప్రమాదకర స్తాయి కంటే రెండు అడుగులు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. పంజాబ్ లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్, హర్యానాల్లో 18 మంది మృతి చెందారు. కల్కా షిమ్లా రైలు సెక్షన్ వర్షాలకు చెట్లు కూలి బాగా దెబ్బతింది. ఈనెల 16 వరకు రైళ్లు తిరగవని అధికారులు చెప్పారు. ఎప్పటికప్పుడు వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. ఆనకట్టలన్నీ భద్రంగా ఉన్నాయని, ప్రమాదకర స్థాయికి తక్కువగా నీటి మట్టాలు ఉన్నాయని చెప్పారు.
- Advertisement -