Wednesday, January 22, 2025

ఇక ప్రలోభాల ఎర

- Advertisement -
- Advertisement -

ఓటుకు రూ. 10 వేలు

పోటాపోటీగా సాగనున్న పంపకాలు ప్రచారం
ముగిసిన వెంటనే డబ్బు పంపిణీ ఏర్పాట్లు
ఆన్‌లైన్, గూగుల్ పే, ఫోన్‌పేలోనూ చెల్లింపులకు
ప్రణాళికలు హవాలా మార్గంలో మునుగోడుకు
చేరుతున్న నోట్ల కట్టలు నిఘా యంత్రాంగం
కన్నుగప్పుతున్న ముఠాలు హైదరాబాద్‌లో
ఇస్తే మునుగోడులో అందేలా ఎత్తుగడలు
రియాల్టర్లు, స్కూళ్లు, బంకులతో ఒప్పందాలు
రూ.250 కోట్లకు పందేరం

మునుగోడు ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీలు చేస్తున్న ప్రలోభాల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఓటుకు ఇంత అని ధర ఫిక్స్ చేసి మరీ పంపిణీ చేసేందుకు నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక పార్టీ రూ.4వేల నుంచి రూ.5వేల దాకా పంచే ఆలోచనలో ఉంటే, ఇంకోపార్టీ దీనికి కొంత అదనంగా జోడించి రూ.6వేల దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. మరో పార్టీ ఓటుకు రూ. వెయ్యి పెంచి ఏడు లేదా ఎనిమిది వేలు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. మొత్తంమీద రూ.10వేల వరకు ధర పలుకుతున్నదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పంచుడు మొత్తం రూ.250 కోట్లు దాటవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని మునుగోడుకు తరలించేందుకు ఆయా పార్టీలు అనేక మార్గాలు ఎంచుకున్నాయి. హవాలా నుంచి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌ల దాకా అన్ని అవకాశాలనూ పంపిణీకి వినియోగించుకుంటున్నాయి. ఓటర్లకు రోజువారీగా అందిస్తున్న మందు, బిర్యానీలు సరేసరి!

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: మునుగోడు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రలోభాల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఓటుకు ఇంత అని ధర ఫిక్స్ చేసి మరీ పంపిణి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక పార్టీ రూ.4వేల నుంచి రూ.5వేల దాకా పంచే ఆలోచనలో ఉంటే, ఇంకోపార్టీ దీనికి కొంత అదనంగా జోడించి రూ.6వేల దాకా ఇచ్చేందుకు సిద్దమయిది. మరో పార్టీ ఓటుకు రూ. వెయ్యి పెంచి ఏడు లేదా ఎనిమిది వేలు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ప్రత్యార్థులు తమ గుర్తుకు ఓటు వేసేలా ఓటరుకు పక్కాగా ధర ఫిక్స్ చేసి మరీ డబ్బుచేతిలో పెట్టేందుకు పార్టీలు సిద్దమవడంతో ఉప ఎన్నికల్లో పంచుడు మొత్తం రూ. 200కోట్ల నుంచి రూ.250 కోట్ల దాకా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని మునుగోడుకు తరలించేందుకు ప్రధాన పార్టీలు వివిధ మార్గాలు ఎంచుకున్నాయి. హవాలా నుంచి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌ల దాకా అన్ని మార్గాలనూ డబ్బు పంపిణికి వినియోగించుకుంటున్నాయి.

హైద్రాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి వరంగల్ ,ఖమ్మ, కరీంనగర్ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున డబ్బును హవాలా మార్గంలో మునుగోడుకు చేరవేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల సమయంలొ ఎవరివద్ద అయినా రూ. 2.50లక్షల కంటే ఎక్కువ నగదును పట్టుకుంటే, వారు ఆ నగదుకు ఎన్నికలకు సంబందంఏమీ లేదని రుజువ చేసే వివరాలు, కారణాలు, రసీదులు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధన లక్షం. ఈ క్రమంలోనే మునుగోడు సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాలలో కూడా రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఫలితంగా పలు పార్టీల నాయకులు హవాలా మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటకీ వారు కళ్లుగప్పి విఐపిల వాహనాల్లో మునుగోడుకు డబ్బు తరలిస్తున్నారు. కేంద్ర బలగాలు ఉన్న చోట పకడ్భందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చివరి రోజులే కీలకం…

మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడినప్పటినుండి విస్తృతంగా ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి హాజరయ్యేవారికి రూ. 300నుంచి రూ.500 చొప్పున కూలీ ఇస్తున్నారు. దీనికి తోడుగా భోజనం , మద్యం, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు.ప్రజా ప్రతినిధులు ఏ పదవిలో ఉన్నా రేటు నిర్ణయించి నగదు, నజరానాలు ముట్టజెబుతున్నారు. ఖరీదైన కార్లు కొనిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వందల సంఖ్యలో వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే … చివరి రెండు రోజులూ ఓటర్లకు డబ్బు పంచడం మరొక ఎత్తు. దీన్ని రాజకీయ పార్టీలు సవాల్‌గా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఓటుకు ఎంతిస్తుందో చూసి దానికి రెండింతలు , అవసరమైతే మూడింతలు ఇచ్చేలా సమాయత్తమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 2.42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి?, ఎంతచొప్పున ఇవ్వాలి?అని జాబితాలు తయారు చేస్తున్నారు. రాజమార్గంలో , అడ్డదారిలో, ఆన్‌లైన్ పద్దతిలో , గూగుల్‌పే, ఫోన్‌పే.

వంటివాటి ద్వారా ఇలా, ఎలా వీలైతే అలా ఓటుకు నోటు ఇవ్వడానికి నిధులు సమకూర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికలు , ఉప ఎన్నికలతో పోలీస్తే మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ఖరీదైన ఎన్నికగా మార్చేశాయి. హైద్రాబాద్ నుంచి మునుగోడుకు హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బు చేరవేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, మద్యం ట్రేడర్లు, ఆడితీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, ఫెర్టిలైజర్ వ్యాపారులతో డీల్స్ మాట్లాడుకుంటున్నారు. హైద్రాబాద్‌లో వారి తరుపువారికి డబ్బు ముట్టజెప్పి కమీషన్ పోను మిగతా సొమ్మును మనుగోడులో వీరినుంచి తీసుకుంటున్నారు. అలాగే మునుగోడులో ఉండేవారిలో ఎవరు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వగలరో ఆరా తీసి వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా హవాలా రూపంలో మునుగోడుకు పెద్ద ఎత్తున డబ్బు వస్తుండటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News