Friday, December 20, 2024

జిల్లా వ్యాప్తంగా 10 వేల పోస్ట్ కార్డులు..

- Advertisement -
- Advertisement -

10 thousand postcards for PM Modi across Siddipet

సిద్దిపేట: జిల్లాలో మంత్రి హరీష్ రావు సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి 10 వేల పోస్ట్ కార్డు ఉత్తరాలు రాయనున్నారు. సిద్దిపేట, దుబ్బాక గజ్వేల్, కోహెడ, చేర్యాల బెజ్జంకి ప్రాంతాల్లో వివిధ సొసైటీ ద్వారా మొత్తంగా 10వేలు పోస్ట్ కార్డులు పంపిణీ చేసి త్వరలోనే మోడీకి పంపనున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో చేనేత కార్మికులు అలమటిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జిఎస్టీ వేయడం నేతన్నల నెత్తిన భారం వేసినట్టే అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు చేయూత నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారు చేతితో చెమటోర్చి చేసిన కష్టాన్ని చేజారిస్తుందని ఎద్దేవా చేసారు. చేనేత వస్త్రాల పై జిఎస్టీ ఎత్తివేసే వరకు నేతన్నల కు అండగా ఉంటామన్నారు. రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కేటీఆర్, ప్రధాన మంత్రి మోడీ కి జిఎస్టీ ఎత్తి వేయాలని లక్ష పోస్ట్ కార్డుల కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 10 వేల కార్డు లు వేస్తున్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News