- Advertisement -
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. వాజానగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ (47165) సమయం మార్చినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ వారం వాజా నగర్ నుంచి ఉదయం 8.50 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.
రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్- టు లింగంపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తుండగా, లింగంపల్లి- టు ఫలక్‌నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, వాజానగర్- టు లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను రద్దు చేశారు. స్టేషన్లలో రద్దు చేయబడిన రైళ్ల సమయాలు, క్యారేజీ నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు.
- Advertisement -