హైదరాబాద్: సాంకేతిక కారణాలు, యార్డ్ రీమోడలింగ్ పనుల నిమిత్తం కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రద్దైన ఈ రైళ్ల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని అంకై కిల్లా, మన్మాడ్ రైల్వే స్టేషన్లలో యార్డ్ రీమోడలింగ్ పనులు జరుగు తుండడంతో ఆ వైపుగా నడిచే 10 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రద్దైన రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు గ్రౌండ్- నిజామాబాద్ (రైలు నెం. 11409) రైలును రద్దు చేయగా, అలాగే నిజామాబాద్ – ఫుణె రైలు (నెం. 11410) జూన్ 24 నుంచి 27 తేదీ వరకు అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ -టు ముంబై సిఎస్‌టి రైలు (నెం. 17058)ను జూన్ 25, 27 తేదీల్లో రద్దు కాగా, ముంబై సిఎస్‌టి టు – సికింద్రాబాద్ రైలు (నెం. 17057)ను జూన్ 26, జూన్ 28 తేదీల్లో రద్దు కాగా, అలాగే దప్పర్ – హెచ్‌ఎస్ నాందేడ్ రైలు (నెం. 12729 ) ను జూన్ 27వ తేదీన రద్దు చేయగా, హెచ్‌ఎస్ నాందేడ్ టు హదాప్సర్ రైలు (నెం.12730)ను జూన్ 26వ తేదీ. రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.