Sunday, January 19, 2025

వందలాది బస్తాల కింద 10 మంది కూలీలు

- Advertisement -
- Advertisement -

కర్నాటక గిడ్డంగిలో దుర్ఘటన , వెలికితీతకు బుల్‌డోజర్లు

బెంగళూరు : కర్నాటకలో సోమవారం పది మందికి పైగా కూలీలు వందలాది ధాన్యపు బస్తా సంచీల కింద చిక్కుపడ్డారు. విజయపురా పారిశ్రామిక ప్రాంతంలోని గిడ్డంగిలో ఈ ఘటన జరిగింది. ఇందులోని ఓ స్టోరేజ్ యూనిట్ కుప్పకూలి, లోపలి బస్తాలు కిందపడ్డాయి. అక్కడ పని చేస్తున్న కూలీలు సంచీల కింద చిక్కుపడ్డారు.

విషయం తెలియగానే సహాయక బృందాలు అక్కడికి వచ్చాయి. బుల్‌డోజర్లతో సంచీలను తీసివేసే ప్రయత్నాలు చేపట్టారు. కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. మరి సంచీల కింద నలిగిన కూలీల సంగతి ఏమిటనేది తేలాల్సి ఉంది. ఉత్తర్‌కాశీలో ఇటీవలే టన్నెల్ కూలి 41 మంది కూలీలు 41 రోజుల వరకూ చిక్కుపడి, ఎట్టకేలకు వెలుగు చూడగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News