Friday, January 3, 2025

విషాదం.. గుండెపోటుతో 10 ఏళ్ల బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యకాలంలో గుండెపోటు గుబులుపుట్టిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికి గుండెపోటు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలకాంలో చాలామంది గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.

రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News