Wednesday, December 25, 2024

ప్రాణం తీసిన దాగుడుమూతలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : దాగుడు మూతలు ఆడుతూ పత్తి కుప్పలో దాక్కొని  ఊపిరాడక అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నేపల్లిలోని చెన్నూరు కైలాస్, రమ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ పాప ఉన్నారు. పెద్ద కొడుకు అభిషేక్ (10) కౌటాల లోని ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బడికి వెళ్లి వచ్చిన అభిషేక్. తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడు మూతల ఆట ఆడారు. ఆ సమయంలో తల్లిదండ్రులు చేనులో ఉన్నారు. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా ఉండేందుకు ఇంట్లోనిల్వ చేసిన పత్తి కుప్పలోకి చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. తల లోపలకు వెళ్లగా కాళ్లు బయటనే ఉండి. పోయాయి. కొద్ది సేపటికి అభిషేక్ చెల్లి, తమ్ముడు చూసి గట్టిగా అరిచారు. అప్పటికే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అభిషేక్ ను బయటకు లాగి వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.  అయితే అప్పటికే అభిషేక్ మృత్యువాత పడ్డాడని డాక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News