Wednesday, January 22, 2025

తాబ్రేజ్ అన్సారీ హత్యకేసు.. 10 మందికి పదేళ్ల కఠిన కారాగారం

- Advertisement -
- Advertisement -

సెరైకెలా (ఝార్ఖండ్ ) : 2019 జూన్ నాటి తాబ్రేజ్ అన్సారీ హత్య కేసులో దోషులు పదిమందికి జిల్లా కోర్టు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. మోటారు సైకిల్ దొంగిలించాడన్న నేరారోపణపై కొందరు అతడిని చితకబాదారు. అతనిచే బలవంతంగా జైశ్రీరామ్, జై హనుమాన్ అనిపించేవరకు విడిచిపెట్టకుండా హింసించారు. ఆ తరువాత తాబ్రేజ్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఈ కేసులో అడిషనల్ జిల్లా జడ్జి అమిత్ శేఖర్ దోషులు పదిమందికి శిక్ష విధించారు. మరో ఇద్దరు దోషులు సరైన సాక్షాధారాలు లేనందున విడిచిపెట్టారు. ఈ శిక్ష తీవ్రతను కోర్టు బుధవారం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News