Monday, December 23, 2024

కొత్త అసెంబ్లీలో 10మంది.. వయసులో చిన్నవాళ్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో పదిమంది పిన్న వయస్కులు ఉండటం విశేషం. ఈ జాబితాలో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకరరావుపై గెలిచిన యశస్విని మామిడాల (కాంగ్రెస్) అగ్రస్థానంలో ఉంది. ఆమె వయసు 26 ఏళ్లే. తర్వాతి స్థానంలో మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్) ఉన్నారు. మెదక్ నుంచి గెలిచిన రోహిత్ వయసు కూడా 26 ఏళ్లే. మిగిలిన వారిలో చిట్టెం పర్ణికారెడ్డి (30)- కాంగ్రెస్, లాస్య నందిత సాయన్న (36)- బీఆర్ఎస్, వెడ్మ భొజ్జు (37)- కాంగ్రెస్, పాడి కౌశిక్ రెడ్డి (38)- బిఆర్ఎస్, జారే ఆదినారాయణ (40)- కాంగ్రెస్, కుందూరు జైవీర్ (41)- కాంగ్రెస్, అనిరుధ్ రెడ్డి జానంపల్లి (42)- కాంగ్రెస్, మహ్మద్ మాజిద్ హుస్సేన్ (43)- ఎంఐఎం ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News