మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో బోరు బావిలో పడ్డ బాలుడిని అధికారులు క్షేమంగా బయటకు తీశారు. శనివారం గుణలో దాదాపు 25 అడుగుల బోరుబావిలో సుమిత్ అనే బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీలుసు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం బాలుడిని సురక్షితంగా కాపాడారు. అనంతరం చికిత్స కోసం బాలుడిని స్క్యూ టీమ్ ఆస్పత్రికి తరలించారు. బోరుబావిలో పడిపోయిన 10 ఏళ్ల బాలుడు సుమిత్‌ను జేసీబీల ద్వారా రక్షించినట్లు అధికారి ఆదివారం తెలిపారు.
గుణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాన్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. “శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు సుమిత్ బోర్‌వెల్‌లో పడిపోయాడు. అతన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు సుమిత్‌ను బోర్‌వెల్ నుండి బయటకు తీశారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అతని శ్వాస నెమ్మదిగా ఉంది… ప్రస్తుతం బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు” అని చెప్పారు.