ఖమ్మంలో భారీ బహరింగ సభను బిఆర్‌ఎస్ పార్టీ కనివినీ ఎరగని స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు ఏర్పాట్లు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందు నుంచే భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమయ్యాయి. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని బిఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ కోసం అధికార పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 400 ఎకరాలను సిద్ధం చేశారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. 50 స్క్రీన్లు, 10 లక్షల నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచనున్నారు.
100 ఎకరాలలో బిఆర్ఎస్ బహిరంగ సభ
- Advertisement -
- Advertisement -
- Advertisement -