Sunday, January 19, 2025

3 రోజులుగా థాయిలాండ్ విమానాశ్రయంలో ప్రయాణికుల నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు
16న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం
ఆలస్యంగా ప్రయాణం, ఎమర్జన్సీ ల్యాండింగ్
స్పందించిన విమాన సంస్థ

న్యూఢిల్లీ : విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 100 మందికి పైగా ఎయిర్ ఇండియా ప్రయాణికులు థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో 80 గంటలకు పైగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 16న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం అక్కడే నిలచిపోయింది. ప్రయాణికులు గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. అలా వారు 80 గంటలుగా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. తాము ఇక్కడే గంటలుగా వేచి చూస్తున్నామని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు.

విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తొలుత తాము ఆరు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోవలసి వచ్చిందని, ఆ తరువాత విమానం సిద్ధంగా ఉందని తమను ఎక్కించారని, కానీ అంతలోనే నిలిపివేశారని వారు తెలిపారు. అలా 80 గంటలేగా తాము విమానాశ్రయంలోనే ఉండిపోయామని వారు తెలియజేశారు. చిన్నారులు, పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వారు పోస్ట్ చేశారు. ఆ సంఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. టేకాఫ్ అయిన తరువాత సాంకేతిక లోపం కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించామని సంస్థ తెలిపింది. కొందరిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని, మరి 40 మంది ఇప్పటికీ ఫుకెట్‌లో ఉన్నారని సంస్థ తెలియజేసింది. మరి కొన్ని గంటల్లో వారిని సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News