- Advertisement -
విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానంపై ఆసక్తి పెంచడానికి యత్నం
బెంగళూరు : విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి ఎలెక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఆప్టిక్స్, స్పేస్ టెక్నాలజీ , మెటీరియల్ సైన్స్‌ల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) దేశంలో 100 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను దత్తత తీసుకోడానికి నిర్ణయించింది. ఇస్రో, అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్, సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్, దేశంలో 7000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాయి. ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులు దాదాపు మూడు మిలియన్‌ల మందికి ప్రాబ్లెమ్ సాల్వింగ్, టింకరింగ్, ఇన్నొవేటివ్ ఆలోచనలు అలవడేలా శిక్షణ ఇస్తారు.
- Advertisement -