Saturday, November 23, 2024

నగరంలో 100 సీఎన్జీ బంకులు

- Advertisement -
- Advertisement -

ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

100 CNG centers in Hyderabad

మన తెలంగాణ,సిటీబ్యూరో: కాలుష్య నివారణ కోసం సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా నగరంలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం లభిస్తోండగా నగరంలో సీఎన్జీ ( కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్)తో నడిచే వాహనాలు పెరుగున్న నేపథ్యంలో మరిన్ని బంకులు ఏర్పాటు చేయాలని బాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే నగరంలో 32 సీఎన్జీ బంకులు ఉండగా దశలవారీగా 100 బంకులు ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఏర్పాటు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తుంది. సుజికి వంటి వాహన ఉత్పత్తి సంస్థ చిన్న వాహనాల కేటిగిరిలో డీజిల్ వాహనాలను నిలిపివేసి సీఎన్జీ వాహనాలు తీసుకు రావాలని యోచిస్తుంది. ఇదే దారిలో మరికొన్ని కంపెనీలు సీఎన్జీ వాహనాలు అందబాటులోకి తెస్తున్నాయి.

ఇప్పటికే సుజికిలో వ్యాగన్‌ఆర్, సెలీరియో, ఆల్టో వంటి వాహనాలు విజయవంతంగా నడుస్తుండగా, అనేక మంది వాహన దారులు తమకు సంబధించి వాహనాలకు సీఎన్జీ కిట్లును బిగించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎన్జీ ధర పెట్రోల్ కన్నా తక్కువగా ఉండటం, మైలేజ్ అధికం రావడం, కాలుష్యం లేక పోవడం, తదతర కారణాలతో అనేక మందిని వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో వీటి అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం అధికంగా ఉండటంతో వీటి అక్కడి వాహనదారులు వీటిని కోనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

వీటిని ప్రాధాన్యత పెరుగుతుండటంతో సీన్జీ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కొన్ని ప్రాంతాలను భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ గుర్తించింది. వాటిలో మెహదీపట్నం ( గచ్చిబౌలీ ప్రధాన రహదారి, బయోడైవర్శిటీ పార్క్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే మార్గంలో), సికింద్రాబాద్ (సంగీత్ థియేటర్ వద్ద), ఉప్పల్ మార్గంలో ( వయా రైల్ నిలయం, మెట్టుగూడ,తార్నాక, హబ్సిగూడ), ఆర్పిరోడ్ నుంచి తిరుమలగిరి జంక్షన్ ( వయా ప్యారడైజ్, జేబిఎస్) ,లక్డికాపూల్ నుంచి సోమాజీగూడ మార్గంలో ( ఖైరతాబాద్ జంక్షన్, రాజ్‌భవన్ రోడ్డు),

ఖైరతాబాద్ జంక్షన్ నుంచి జేఎన్టీయు( ఎర్రమంజిల్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, మూసాపేట) జెఎన్టీయు నుంచి హైటెక్ సిటీ ( ఫోరం మాల్), జెన్టీయు జంక్షన్ నుంచి రామచంద్రాపురం జంక్షన్ ( ఆల్విన్ ఎక్స్‌రోడ్, మదీనాగూడ, చందానగర్, బిఎచ్‌ఈఎల్,) లింగంపల్లి నుంచి తెల్లాపూర్ (నల్లగండ్ల) , ఈసీఐఎల్ నుంచి సైనిక్‌పురి ( ఏఎస్‌రావు నగర్,) తదితర ప్రాంతాలో ఏర్పాటు చేసేందుకు అనువైన ఏరియాల్లో వీటిని నిర్మించనున్నారు. 2005లో ప్రారంభ మైన సీఎన్జీ క్రమేపి విస్తరించి ప్రస్తుతం 52 బంకలకు చేరింది. వీటిని మరింత విస్తరించి సీఎన్జీ వాహన దారులను గ్యాస్ లభ్యత సమస్య నుంచి బయటపడ వేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News