Monday, December 23, 2024

పూనమ్ పాండేపై 100 కోట్లకు పరువు నష్టం కేసు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండేపై పరువు నష్టం కేసు దాఖలైంది. సర్వైకల్ కాన్సర్ వంటి ఒక తీవ్రమైన వ్యాధిపై పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెపై 100 కోట్ల రూపాయలకు ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి పరువునష్టం దావా వేశాడు.

పూనమ్ పాండే మరణించినట్లు ఈనెల 2న సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత తాను బతికే ఉన్నానంటూ పూనమ్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. సర్వైకల్ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చింది.

ఇదంతా పూనమ్ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఆడిన పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసిన ఫైజాన్ అన్సారీ, ప్రజలతో ఆమె అపహాస్యం ఆడిందని విమర్శించారు. పూనమ్ తోపాటు ఆమె భర్త సామ్ బాంబేపైనా అతను కేసు పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News