Monday, December 23, 2024

పిజి సీట్లలో వంద కోట్ల కుంభకోణం… ఇడి దర్యాప్తు ముమ్మరం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్య కళాశాల పిజి సీట్ల కుంభకోణంలో ఇడి దర్యాప్తు ముమ్మరం చేసింది. వంద కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లు ఇడి అనుమానం వ్యక్తం చేస్తుంది. 2016-22 మధ్య కొన్ని వైద్య కళాశాలల్లో పిజి అడ్మిషన్‌లలో గోల్‌మాల్ జరుగుతోంది. గత నెలలో 16 ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి వైద్య కళాశాలతో పాటు ఇతర వైద్య కళాశాలల్లో ఇడి సోదాలు చేపట్టింది. సోదాలు అనంతరం భారీగా నగదుతో పాటు కీలక పత్రాలు ఇడి స్వాధీనం చేసుకుంది. నిధులను యాజమాన్యం సొంత ఖాతాలకు మళ్లించినట్లుగా ఇడి గుర్తించింది. 2022లో కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా గత నెలలో మానీలాండరింగ్ కేసును ఇడి నమోదు చేసింది.

Also Read: ఆశలు రేకెత్తిస్తున్న వర్షాలు !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News