Saturday, January 11, 2025

నర్సాపూర్ కి రూ. 100 కోట్లు ఇస్తాం: రేవంత్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి 70 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  చెప్పారు. హైదరాబాద్ నగరం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. అనేక ఫ్లై ఓవర్లను నిర్మించిందనీ, మెట్రో రైలును తీసుకువచ్చిందనీ చెప్పారు. తమ పార్టీ అధికారలోకి రాగానే మెదక్ జిల్లా నర్సాపూర్ కి 100 కోట్ల నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సాపూర్ లో జరిగిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన మాట్లాడారు.

తమ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన నమ్మకద్రోహుల్ని అసెంబ్లీ గేటు దాటి లోనికి రానీయవద్దని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల ఆర్థికసాయం అందిస్తుందన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందనీ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News