Wednesday, January 22, 2025

పెను ప్రమాదం… లారీలో పేలిన వంద సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు అంటుకోవడంతో 100 సిలిండర్లు పేలిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ శివారులోని అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భారత్ గ్యాస్ సిలిండర్ లోడుతో లారీ కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళ్తుండగా క్యాబిన్‌లో మంటలు అంటుకున్నాయి. వెంటనే లారీ డ్రైవర్ మోహన్ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చేసరికి మంటలు లారీకి అంటుకోవడంతో పాటు సిలిండర్లు పేలుతున్నాయి. లారీ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేశారు. సిలిండర్ ఒక్కొక్కటి పేలడంతో దగ్గరలో ఉన్న 30 ఇండ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి సిలిండర్లు పేలుతుండడంతో మంటలను ఆర్పడం కష్టంగా మారింది. రెండు వందల మీటర్ల దూరం నుంచి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరు వైపులా రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News