Wednesday, January 22, 2025

కేంద్ర పోలీసుకు వందరోజుల సెలవులు

- Advertisement -
- Advertisement -

100 days annual leave plan for central police forces troops

షా ఆలోచన త్వరలో అమలులోకి

న్యూఢిల్లీ : కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు వంద రోజుల (సిఎపిఎఫ్) వార్షిక సెలవుల కోటాను వినియోగించుకునే సౌలభ్యం ఏర్పడుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అత్యంత కీలకమైన ప్రతిపాదనను తీసుకువచ్చారు. విధి నిర్వహణల భారంతో ఉండే ఈ పోలీసు సిబ్బందికి తగు మానసిక శారీరక విశ్రాంతిని కల్పించాలని గుర్తించారు. వారు తమ కుటుంబాలతో కలిసి కనీసం వందరోజులు సంతోషంగా గడిపేందుకు ఈ ప్రత్యేక సెలవుల సదుపాయానికి దిగుతున్నారు. సంబంధిత విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. దీనిని కార్యాచరణలోకి తీసుకువస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యంత కీలకమైన ఈ భద్రతా విభాగానికి సంబంధించి వంద రోజుల సెలవు దినాల మంజూరీ అంశంపై అన్నిస్థాయిలలో బేరీజు వేసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ దిశలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు దఫాల సమావేశాలు నిర్వహించింది. హోం మంత్రి ఆలోచనా విధానం అమలుకు ఎదురవుతున్న చిక్కులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి దీనిని సాకారం చేయాలని విస్తృతరీతిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News