Monday, December 23, 2024

నేటితో వంద రోజులు ..

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : ఇజ్రాయెల్ హమాస్ అధీన గాజాస్ట్రిప్‌లో భీకర పోరు ఆరంభమయ్యి నేటితో (ఆదివారంతో) వందరోజులు అవుతుంది. ఇరు వైరిపక్షాల నడుమ ఇది ఇంతకుముందెన్నడూ లేని సంకుల సమరం, సాధారణ పౌరుల రక్తపాత ఘట్టం అయింది. ఉధృతమే తప్పితే అంతం సంకేతాలు లేకుండా ఈ వైరివర్గాల ఘర్షణ సాగుతోంది. ఇజ్రాయెల్ 1948లో అవతరించిననాటి నుంచే పాలస్తీనియన్లతో ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. అయితే ఇప్పటి ఘర్షణ ఎప్పటికప్పుడు అంతం కాదిది ఆరంభం తరహాలో ఉంది. తమపై హమాస్ సాయుధ బలగాలు గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన దొంగదెబ్బ తీశాయని ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధ సంపత్తి, వేగుచర్యల సునిశితత గల ఇజ్రాయెల్ రగులుతోంది. ఇది ఇప్పుడు గాజాస్ట్రిప్‌లో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో హమాస్ బలగాల నిర్మూలనే ధ్యేయంగా ఇజ్రాయెల్ నేత నెతన్యాహు తమ సేనలను కదిలిస్తున్నారు. దీనిని హమాస్ ఇదే తరహాలో ప్రతిఘటిస్తోంది.

చివరికి సాధారణ పౌరులను తమ ఆత్మరక్షణ కవచాలుగా మార్చుకొందని, ఇజ్రాయెలీ బందీలను అడ్డుగా పెట్టుకుని దాడులకు దిగుతోందని వెల్లడైంది. చివరికి ఈ ఘర్షణల ఉదంతం ఇప్పుడు ఐరాస సారధ్యపు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. అయితే అక్కడ పరస్పర ఆరోపణలతోనే వివాదాస్పద పర్వం సాగింది , ఇంతకు మించి ఎటువంటి రాజీ దాఖలాలు వెలువడలేదు. తమపై దాడుల తరువాతి క్రమంలో వెంటనే ఇజ్రాయెల్ సైనిక బలగాలు గాజాపై విరుచుకుపడ్డాయి.ముందుగా వైమానిక దాడులు తరువాత భూతల దాడులతో హమాస్ ఆయువుపట్టు స్థావరాలను చివరికి టన్నెల్స్‌ను కూడా నేలమట్టం చేశారు. ఈ క్రమంలో సామాన్య పౌరుడు రోజుల తరబడి తిండితిప్పలు లేకుండా, గాయపడ్డా కనీస చికిత్సకు నోచుకోకుండా నానా పాట్లు పడాల్సి వచ్చింది. అయితే ఇజ్రాయెల్ దాడులను పట్టించుకోకుండా హమాస్ తమ చెరలోని బందీలను అడ్డుపెట్టుకుని ఎదురుదాడులకు దిగుతోంది. దీనితో ఇప్పుడు ఈ వార్ క్రమేపీ ఎర్రసముద్రానికి, ప్రపంచ దేశాల మధ్య విభజనరేఖల తీవ్రతకు దారితీసింది. ఇప్పటి యుద్ధం దాడి వరుసక్రమం .

అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది. ఇది అనూహ్యరీతిలో సాగడంతో అక్కడి నేతలు, సైనికాధికారులు, ఇంటలిజెన్స్ వర్గాలకు షాక్ కొట్టించింది. ఎదురుదాడుల క్రమంతో ఇజ్రాయెల్ పాలకుల పట్ల అక్కడి ప్రజానీకంలో నమ్మకం ఏర్పడ్డా, వారికి అక్టోబర్ 7వ తేదీనాటి హమాస్ దాడుల తీవ్రతతో అధికారిక వ్యవస్థ పట్ల అసహనం ఇప్పటికీ కొట్టొచ్చినట్లుగానే ఉంది. వేలాది మంది ఇజ్రాయెలీ సైనికులు ఇప్పుడు ఆపరేషన్ హమాస్‌లో నిమగ్నం అయ్యారు. ఈ దశలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులలో పాలస్తీనియన్లు చిత్రవధలకు గురి అవుతున్న వైనం అంతటా సార్వత్రిక ఖండనలకు దారితీస్తోన్నా , ఇప్పుడు దీనికి కనుచూపు మేరలో ఎటువంటి ఉపశమనం లేని స్థితి నడుమ వందరోజుల సామాన్యుడి చిత్రవధ కొనసాగుతోంది. అక్టోబర్ 7 తరువాత గాజాలో మునుపటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ దశ నుంచే ఇజ్రాయెల్ కూడా మునుపటిలాగా కాకుండా ఇంతకు ముందటి శత్రువులు, కొత్త శత్రువుల నుంచి సవాళ్లు ఎదుర్కొవల్సి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News