Friday, December 20, 2024

రోడ్డు నిర్మాణంపై ఐఎఎస్, ఐపిఎస్ వర్సెస్ హెచ్ఎండిఎ వివాదం…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాల్‌గూడలో ఐఎఎస్, ఐపిఎస్ వర్సెస్ హెచ్‌ఎండిఎ అధికారుల మధ్య వివాదం నడుస్తోంది. ల్యాంకోహిల్స్ దగ్గర హెచ్‌ఎండిఎం ఆధ్వర్యంలో 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోడ్డు పనులను ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అడ్డుకున్నారు. 2007లో 57 ఎకరాలు ఆదర్శ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించింది.

తమకు కేటాయించిన స్థలంలో రోడ్డు పనులను ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అడ్డుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద పీట్ల రోడ్డు నిర్మాణాలు పనులు చేస్తున్నామని హెచ్‌ఎండిఎ అధికారులు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డును చూసి హైరేజ్ అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలకు హెచ్‌ఎండిఎ అనుమతి ఇచ్చింది. రోడ్డు వేయవద్దని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అడ్డుపడుతున్నారు. రోడ్డు వేసి తీరుతామని హెచ్‌ఎండిఎ అధికారి ఇఇ విజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News