పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఆదివారం ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల అభిమానులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో ఇరువర్గాల ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనంతరం స్టేడియం బయటకు వచ్చి కొట్టుకున్నారు. దీంతో వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అంతేకాదు.. స్థానిక పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ దాడుల్లో మందలమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతదేహాలతో ఆస్పత్రి నిండిపోయిందని ఓ డాక్టర్ మీడియాకు వెల్లడించాడు. అభిమానులు దాడులు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రద్యాప్తు చేపట్టారు.
#Alerte/N’zérékoré : La finale du tournoi doté du trophée « Général Mamadi Doumbouya » vire au dr.ame… pic.twitter.com/fjTvdxoe0v
— Guineeinfos.com (@guineeinfos_com) December 1, 2024