Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో 100 మంది టివీ టెక్నిషియన్ యూనియన్ సభ్యులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులపై వివిధ యూనియన్, పార్టీల నుంచి భారీగా బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టివి టెక్నికల్ యూనియన్ సభ్యులు అర్బన్ ఎంఎల్‌ఏ క్యాంపు కా ర్యాలయంలో గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 100 మంది బిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. అనంతరం బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధి చూసి ప్రజలు బిఆర్‌ఎస్‌లో చేరడానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మొదటి రోజు రజక సంఘ సభ్యులు, రెండో రోజు టివీ టెక్నిషియన్ యూనియన్ సభ్యులు చేరడం శుభపరిణామమనిఅన్నారు. నిజామాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరం సుందరీకరణ, పచ్చదనం, సెంటర్ మీడియన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పార్కులు ప్రజలను కనువిందు చేస్తున్నాయన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో ఇంకా చేరికలు భారీగా పెరుగుతాయని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ తాగునీరు, సాగునీరు, విద్యుత్, వైద్యం, విద్యా, వైద్యం ఇలా ఏ రంగాన్ని చూసినా ఈ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో ఎనాడూ చూడని సంక్షేమ పథకాలను ప్రజలు చూస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలోనైనా కాక దేశంలోనే కెసిఆర్ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిచారన్నారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ మూడోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారు బిఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు సిర్ప రాజు, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్‌సింగ్, టివి టెక్నిషియన్ యూ నియన్ సభ్యులు ప్రశాంత్, భూమేశ్వర్, శ్రీనివాస్, రాజు, మహేందర్, గంగాధర్, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News