Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ తరపున 100 మంది ఎన్నారైలు ప్రచారంలో పాల్గొంటారు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా
ప్రజల్లోకి తీసుకెళతాం
కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓటేయ్యాలి
గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైందని, ఈ ప్రచారంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు 100 మంది ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటారని గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. మహేష్ బిగాల ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ ఎన్నారైల మీడియా సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఇటీవల కెటిఆర్‌తో జరిగిన ఎన్నారైల సమావేశంలో క్షేత్ర స్థాయిలో ఎన్నారైలు ప్రచారంలో పాల్గొనాలని కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటారన్నారు. దీంతోపాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కెసిఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా లేదని, కేవలం కెసిఆర్‌ను తిట్టడం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని, కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం 10 మంది సిఎం సీటు కోసం పోట్లాడుతున్నారని, తెలంగాణలో వచ్చేది మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చాయని, తెలంగాణ మొత్తం అభివృద్ధి కనపడుతుందని, ప్రభుత్వం నుంచి కోరుకునేది అభివృద్ధి మాత్రమేనని ఆయన తెలిపారు. ఎన్నారైలంతా ప్రచారంలో పాల్గొని కెసిఆర్‌కు పట్టం కడుతాన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ దూసరి, చందు తల్లా , పూర్ణ బైరి, విన్నీ గౌడ్, విష్ణు జైగుండా, యూఎస్‌ఏ, యూకె, ఆస్ట్రేలియా, సౌత్‌ఆఫ్రికా, ఆస్ట్రియా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News