Monday, December 23, 2024

బిజెపి, కాంగ్రెస్ నుంచి 100 మంది బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్, న్యూషాపూర్ నగర్‌లకు చెందిన బిజెపి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దళిత సంఘాల ఐక్య వేదిక మహిళా వింగ్ అధ్యక్షురాలు ఎం.అరుణ ఆధ్వర్యంలో 100మంది బిఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్‌రావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, సమ్మయ్య, ఇందిరా రెడ్డి, సిద్దిక్, శహనాజ్ బేగం, మెహెరున్నిస బేగం, రెహ్మాన్, సత్యనారాయణ, ఇస్మాయిల్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News