- Advertisement -
న్యూఢిల్లీ : 12 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫైజర్ టీకా వందశాతం సామర్థ్యం చూపిస్తోందని వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు బయోఎన్‌టెక్ ఫైజర్ వెల్లడించాయి. పిల్లల్లో వందశాతం సామర్థ్యం చూపించిన టీకా ప్రపంచం లో ఇదేనని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫైజర్ వ్యాక్సిన్‌ను 16 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు వారికి అధికారికంగా వినియోగిస్తున్నారు. అమెరికా లోని 12 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు 2260 మంది పై నిర్వహించిన ప్రాథమిక ట్రయల్‌లో వందశాతం సామర్థ్యం కనిపించిందని ఫైజర్ వివరించింది. అందువల్ల రానున్నకొన్నివారాల్లో ఈ వ్యాక్సిన్ ను 12 నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా వినియోగించాలని ఆరోగ్య నియంత్రణ అధికార యంత్రాంగాన్ని కోరనున్నట్టు ఫైజర్ పేర్కొంది.
- Advertisement -