Saturday, November 16, 2024

అండమాన్ నికోబార్ దీవుల్లో 100 శాతం వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

100 percent vaccination in the Andaman and Nicobar Islands

 

పోర్టుబ్లెయిర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్టు అక్కడి పాలక వర్గం ప్రకటించింది. దీంతో కొవిషీల్డ్ టీకాతో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతం ఇదే కావడం విశేషం. అండమాన్‌నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారమని అక్కడి పాలక వర్గం ట్విటర్‌లో తెలియచేసింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కిమీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకుని వ్యాక్సిన్లు అందజేశామని పేర్కొంది. దట్టమైన, అడవులు, కొండలు దాటుకుని ప్రతికూల వాతావరణం లోనూ టీకాలు అందజేసినట్టు తెలిపింది.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి. మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఇక ఆదివారం అక్కడ కొత్తగా మరో కరోనా కేసును నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం అక్కడ రెండు క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 7,701 కి చేరింది. వీరిలో 129 మంది మరణించారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లోనూ అర్హులందరికీ 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 53.87 లక్షల మంది అర్హులకు డిసెంబర్ 5 నాటికి అందరికీ రెండు డోసుల టీకా అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News