Sunday, December 22, 2024

ఢిల్లీలో మహిళలకు 100 స్పెషల్ మొహల్లా క్లినిక్‌లు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

100 special mohalla clinics for women in Delhi: Kejriwal

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళల కోసం 100 స్పెషల్ మొహల్లా క్లినిక్‌లను ప్రారంభించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వెల్లడించారు. నాలుగు మహిళా స్పెషల్ మొహల్లా క్లినిక్‌లను కేజ్రీవాల్ ప్రారంభిస్తూ మహిళలతోపాటు 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఈ క్లినిక్‌ల్లో ఉచితంగా వైద్య చికిత్సలు అందుతాయని వెల్లడించారు. ఈ మొహల్లా క్లినిక్ వ్యవస్థ కేజ్రీవాల్ ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక పథకం. ప్రాథమిక ఆరోగ్య భద్రతను మరింత పెంపు చేయడమే దీని లక్షం. ఈ నాలుగు మొహల్లా క్లినిక్‌ల్లో గైనకాలజీ సర్వీసులు, పరీక్షలు, మందులు ఉచితంగా మహిళలకు లభిస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. మొదటి దశలో వంద క్లినిక్‌లు ప్రారంభమౌతాయని , డాక్టర్లు, సిబ్బంది, అంతా మహిళలే ఉంటారని చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ వంద క్లినిక్‌లు ఏర్పాటవుతాయో స్పష్టం చేయలేదు. సరాసరిన ప్రతి మొహల్లా క్లినిక్‌లో రోజూ 116 మంది రోగులకు వైద్యం అందిస్తారు. మొత్తం 60 వేల మందికి రోజూ వైద్యం ఈ క్లినిక్‌లో అందుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News