కరీనంగర్: ప్రజల అరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్ ను 100.19 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందున నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. 2001 సంవత్సరంలో సింహ గర్జనను కేసిఆర్ కరీంనగర్ లోనే ప్రారంభించిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కాళేశ్వరం జలాలతో నేడు రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగు అవుతుదని పేర్కోన్నారు. 2014 సంవత్సరంలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కరీంనగర్ సిటీ రినోవేషన్ (అభివృద్ది) పథకాన్ని ప్రారంభించారని మంత్రి తెలిపారు.
మొదటి జి.ఓ తో కేసిఆర్ రూ. 92 కోట్లను విడుదల చేయగా నగరంలో రోడ్లను అభివృద్ది చేశామని అన్నారు. గతంలో కరోనా అనగానే భయపడ్డ కరీంనగర్ నేడు కరీంనగర్ ను చూసి కరోనా భయపడే స్థాయికి చేరిందని అన్నారు. వైద్య సిబ్బంది, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెండవ డోస్ వ్యాక్సినేషన్ ను 100శాతం పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు. ఇదే క్రమంలో 3వ దశ కోవిడ్ ను కూడా కట్టడి చేసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ విజయం కేసిఆర్ కే అంకితం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కోవిడ్ కు భయపడవద్దని దైర్యమే మందుగా భావించి ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
100% Vaccination in Karimnagar:Gangula