Friday, October 18, 2024

మత్స్యకారులకు రూ. 1000 కోట్లు ఇచ్చాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

నేను హామీ ఇస్తున్నాను..

ఆర్థిక మంత్రిగా అండగా‌ ఉంటా….

ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు

వీణవంక‌లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీశ్ రావు

1000 Crores give to Fisher mens

హుజూరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మత్స్యకారుల కోసం మోటార్ సైకిళ్లు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వీణవంక‌లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి హరీష్ రావు సమక్షంలో ముదిరాజు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ముదిరాజుల సమస్యలు పరిష్కరిస్తామని,  తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసనని,  కాళేశ్వరంతో ఎన్ని నీళ్లు వచ్చాయో చూస్తున్నామన్నారు.

గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మత్స్యకారుల కోసం రూ. వెయ్యి కోట్లు కెసిఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. రూ. 150 కోట్లతో లగేజ్ ఆటోలు ఇచ్చామని,  రూ. 65 కోట్లతో హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇచ్చామని హరీష్ రావు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని మండలాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇస్తామని, రూ. 75 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేశామని, సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి చేప పిల్లల డబ్బులు మత్స్యకార సంఘాలకు ఇస్తామని, రేపటి నుంచి అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమం చేపడుతామన్నారు. రైతు బీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ. 6 లక్షల భీమా పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని, బిజెపికి ఓటు వేస్తే లాభం జరుగుతుందా?.. టిఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా ఆలోచించాలన్నారు.

పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు. త్వరలోనే ఇక్కడ అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని,  కళ్యాణలక్ష్మీని కొంతమంది పరిగెరుకున్నట్లు అని విమర్శిస్తున్నారని, రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుందని, వీణవంకలో 24/7 ఆస్పత్రిని వెంటనే మంజూరు చేశామని, మనల్ని కష్టంలో సుఖంలో ఆదుకునేది ఎవరో ఆలోచించాలన్నారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోందని, దొడ్డు వడ్లు కొనలేమని కేంద్రం చెబుతోందన్నారు. వీణవంకలో ఓట్లు అడిగే ముందు బిజెపి నాయకులు దొడ్డు వడ్లు కొంటామని కేంద్రంతో చెప్పించాలన్నారు. బిజెపి ఏమిచ్చింది.. నోటి మాటలు కాదు మనకు కావాల్సింది, కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంది సిఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొట్లాడితే 130 కేసులు నమోదు చేసి జైళ్ల పాలు జేశారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కెసిఆర్ ఆశీర్వాదం ఉందని, మీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని హరీష్ రావు తెలిపారు.

బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ముదిరాజులకు సిఎం ఇచ్చిన వాహనాలకు ఉచితంగా ఇవ్వలేదని నిరుపించాలని సవాలు విసిరారు. కెసిఆర్ ముదిరాజ్ లకు లూనాలు ఇచ్చారని, బిజెపి ఉచితంగా‌ 25 లీటర్ల పెట్రోల్ ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. మీ చాక్లెట్లు, పిప్పరమెంట్లు అవసరం లేదని, మత్స్యకారులకు కేంద్రంతో మాట్లాడి‌ రూ. 500 కోట్ల ప్యాకేజీ ఇప్పించి బిజెపి నేతలు ఓట్లు అడగాలని నిలదీశారు.  సెంటిమెంట్ మాటలు‌ కట్టిపెట్టి గ్యాస్, పెట్రోల్,‌డిజీల్ ధరలు‌ తగ్గించి ఓట్లు అడగాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే నర్సింగపూర్ కు బ్రిడ్జి, వీణవంకలో సెంట్రల్ లైటింగ్ ను త్వరలోనే మంజూరు చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రిగా తాను మీకు హామీ ఇస్తున్నానని, మీ కష్టంలో, సుఖంలో అండగా ఉంటానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News