బీరుణ్: గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషీర్ అల్-అసద్ మద్దుతుదారులు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరిగిన ఘరణలతో సిరియాలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 750 మందికి పైగా సామాన్య ప్రజలే ఉండటం గమనార్హం. అసద్ మద్ధతుదారులు భద్రత సిబ్బందిని హత్య చేయడం వల్లే ఈ దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి భద్రతా బలగాలు.. అసద్ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులు చేశారు.
ఈ దాడుల కారణంగా సిరియా మరోసారి అతలాకుతలమైంది. గడిచిన 14 సంవత్సరాలలో ఇది అత్యంత భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ్ ఒకటి వెల్లడించింది. అంతేకాక, బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం.. ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్ మద్ధతుదారులలో 148 మంది ఈ ఘర్షణలో మృతి చెందినట్లు తెలుస్తోంది.