Sunday, January 19, 2025

తెలంగాణ యువతకు 1000 ఉద్యోగాలు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కె.తారకరామారావు ఇంగ్లాండ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో దిగ్గజ సంస్థ అయిన డిఎజెడ్‌ఎన్, హైదరాబాద్‌లో తమ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. లండన్‌లో ఉన్న కెటిఆర్‌ను డిఎజెడ్‌ఎన్ గ్రూప్ ఉన్నతాధికారులైన సందీప్ టికు, వెల్స్‌లు కలిసి తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. 200కు పైగా దేశాల్లో 60 మిలియన్ల సబ్ స్ర్కైబర్లు ఉన్న అంతర్జాతీయ ఓవర్-ది-టాప్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ (ఒటిటి) డిఎజెడ్‌ఎన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు అత్యధికంగా చూసే యుఇఎఫ్‌ఎ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్, సీరీ ఎ, లా లిగా, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ , ఎన్.ఎఫ్. ఎల్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఎన్‌బిఎ (ఎన్‌బిఎ)తో పాటు ఐపీఎల్ (భారత్ మినహా )

Also Read: దక్షిణ భారతదేశం నుంచి బిజెపి పతనం మొదలైంది: హరీశ్‌రావు

వంటి ప్రధాన ఈవెంట్‌ల లైవ్ , ఆన్-డిమాండ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను డిఎజెడ్‌ఎన్ ప్రసారం చేస్తుంది. ఈ పెట్టుబడితో తెలంగాణ యువతకు 1000 ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఇన్నోవేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ఆధిపత్యానికి డిఎజెడ్‌ఎన్ పెట్టుబడే నిదర్శనమని కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News