- Advertisement -
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగలల్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. తాజాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య వెయ్యికి పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపం కారంణంగా కూలిన 30 అంతస్థుల భవంతి కింద మరో 43 మంది చిక్కుకుపోయారు. వీరిని వెలికి తీసేందుకు సహాయకచర్యలు జరుగుతున్నాయి. అయితే మయన్మార్‌లో భూకంపం సంభవించిన వెంటనే ప్రధాన నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్ఱధాని హామీ ఇచ్చారు. ఇప్పటికే భారత్ నుంచి ఆ దేశానికి సహాయపు సామాగ్రిని విమానంలో పంపించారు.
- Advertisement -