Tuesday, December 24, 2024

ఢిల్లీ మహిళలకు ప్రతినెలా రూ .1000

- Advertisement -
- Advertisement -

ఆప్ బడ్జెట్‌లో కొత్తగా ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సోమవారం 202425 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెలా రూ.1000 అందించనున్నట్టు ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిశీ వెల్లడించారు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా రూ .2000 కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఓటు ఉండి, ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, అలాగే ఆదాయ పన్ను చెల్లింపు దారులూ ఈ కొత్త పథకం ద్వారా లబ్ధి పొందలేరని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో వెలువడిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఢిల్లీలో 67,30, 371 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం రూ . 76,000 కోట్ల వార్షిక పద్దును అసెంబ్లీ ముందుంచారు. తమ ప్రభుత్వం రామరాజ్యం ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందిందన్నారు. ఈ బడ్జెట్‌లో బిజినెస్ బ్లాస్టర్స్ అనే పథకాన్ని విశ్వవిద్యాలయాలు, ఐటీఐలకు విస్తరిస్తున్నట్టు అతిశీ ప్రకటించారు. ఇప్పటివరకు దీన్ని స్కూళ్లలో మాత్రమే అమలు చేస్తున్నారు. జీ 20 సన్నాహాల్లో భాగంగా గత ఏడాది ప్రభుత్వం మొత్తం తొమ్మిది పథకాలను ప్రవేశ పెడుతూ రూ. 78,800 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించింది. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మొత్తం వరుసగా రూ.75,800 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించింది. గత ఏడాది ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన ఆతిశీ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఈ సందర్భంగా ఆమె విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు ఒక రూపునివ్వడంలో వారు విశేషంగా కృషి చేసినట్టు తెలిపారు. విద్యారంగానికి తాజా బడ్జెట్‌లో రూ. 16,396 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశాఖకు రూ.8685 కోట్లు ప్రకటించారు. సాంఘిక సంక్షేమం, మహిళశిశు అభివృద్ధి , ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాలకు రూ.6216 కోట్లు, ఢిల్లీ జలబోర్డుకు రూ.7195 కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News