Monday, December 23, 2024

మొక్కలు నాటారు.. అడ్డువస్తున్నాయని నరికేశారు

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మొక్కల సంరక్షణకు కృషి చేస్తోంది. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం జరుగుతుంది. కానీ దీని భిన్నంగా గత నాలుగు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు.. నేడు నీడనిచ్చే చెట్లుగా మారాయి. వాటిని ‘సెస్ సిబ్బంది’ విద్యుత్ హైటెన్షన్ వైర్లకు అడ్డువస్తున్నాయని నరికివేశారు.

రహీంఖాన్‌పేట నుండి వల్లంపట్ల కు వెళ్లె ప్రధాన రహదారికి ఇరువైపుల పచ్చని పోలాల ముందు ఆహ్లాదకరమైన వాతవరణంలో రోడ్డు పై వెళ్లె వాహన దారులకు నీడనిచ్చే చెట్లను నరికివేయడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ చూసుకోవడానికి లక్షలు వెచ్చిస్తుంది. అయితే సుమారుగా నాలుగు సంవత్సరాలుగా మొక్కలు పెరిగేందుకు నిత్యం నీటి సరఫరా, ట్రీ గార్డుల ఏర్పాటు, ఏంతో శ్రమించి చెట్లను పెంచితే భాద్యత యుతంగా చెట్లను కొట్టెయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సుమారుగు వేయ్యి చెట్లకు పైగా నరికివేసినట్లు గ్రామస్థులు చెపుతున్నారు. ఈ సంఘటన పై సర్పంచ్ బిల్లవేని పర్శరాం ను ‘మనతెలంగాణ’ వివరణ కోరగా చెట్లను కొట్టవద్దని సెస్ సిబ్బందికి చెప్పామని, ఈ విషయంగా సంబంధిత కార్యదర్శి, మండల అధికారులకు తెలిపినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News