ఐక్యరాజ్యసమితి: ఐరాసకి చెందిన పలు ఏజెన్సీల ద్వారా భారత్‌కు 10,000 ఆక్సీజన్ కాన్‌సెంట్రేటర్లు, కోటి మెడికల్ మాస్క్‌లను పంపినట్టు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ తెలిపారు.
డబ్ల్యూహెచ్‌ఒ, యుఎన్ పాపులేషన్ ఫండ్ ద్వారా వీటితోపాటు 15 లక్షలకుపైగా ఫేస్ షీల్డ్ పంపామని ఆయన తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ల నిల్వ కోసం కోల్డ్‌చైన్‌ను యునిసెఫ్ ఏర్పాటు చేస్తున్నదన్నారు. యుఎన్ బృందాలు భారత్ కోసం వెంటిలేటర్లు, ఆక్సీజన్ జనరేటింగ్ ప్లాంట్లను కూడా కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. టెస్టింగ్ కిట్లు, విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే థర్మల్ స్క్రీన్లు కూడా ఇప్పటికే భారత్‌కు అందాయన్నారు. డబ్లూహెచ్‌ఒ ద్వారా టెంట్లు, పడకలు అందిస్తున్నామన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు వేలాదిమంది ఆరోగ్య నిపుణుల్ని కూడా భారత్‌కు పంపామన్నారు. భారత్‌లోని 1,75,000కుపైగా వ్యాక్సినేషన్ కేంద్రాలను యునిసెఫ్, యుఎన్‌డిపి పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.