Wednesday, January 22, 2025

ఇండియన్ ఆర్మీకి హైద్రబాదీ మిస్సైల్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ ఆర్మీకి మిస్సైల్ కిట్స్ అందించడం గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన తన ట్విట్టర్‌లో బుధవారం పోస్టు చేశారు. రక్షణ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నట్లు తెలిపారు. బాబా కళ్యాణ్‌జీకి తన ధన్యవాదాలు అంటూ మంత్రి కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ రక్షణ దళాలకు మిస్సైల్స్‌ అందజేస్తున్న తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (కెఆర్‌ఎఎస్) సంస్థ దాదాపు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ ఇస్తున్నదని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇండియాలో తొలిసారి క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. అది కూడా హైదరాబాద్ అడ్డాగా క్షిపణులను తయారీ చేయడం విశేషమని పేర్కొన్నారు.

ఇజ్రాయిల్ కంపెనీ రాఫెల్ భాగస్వామ్యంతో కళ్యాణి సంస్థ హైదరాబాద్‌లో మిస్సైల్ కిట్లను తయారు చేస్తున్నది. ప్రాణాంతకమైన ఆ క్షిపణిని డిఆర్డీవోనే డెవలప్ చేసింది. నేవీ, ఆర్మీ, వైమానిక దళాలు ఈ క్షిపణులను వాడనున్నాయి. మధ్యశ్రేణికి చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను దాదాపు 30 శాతం వరకు డెవలప్ చేసింది. మిస్సైల్ ప్రోపల్షన్ సిస్టమ్‌ను కూడా డిఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ ఈ మిస్సైల్ సిస్టమ్‌కు చెందిన 70 శాతాన్ని డెవలప్ చేసింది. అయితే రానున్న నాలుగేళ్లలో వెయ్యి మిస్సైల్ కిట్స్‌ను ఆర్మీకి అందించనున్నట్లు కళ్యాణి గ్రూపు చీఫ్ బాబా కళ్యాణి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News