Sunday, December 22, 2024

దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం రోజువారీ కోవిడ్ కేసులలో 17 శాతం తగ్గాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 44,891,989కి చేరుకుంది. శనివారం దేశంలో 12,193 కేసులు నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, యాక్టివ్ కేసులు 67,806కి పెరిగాయి. 24 గంటల్లో కరోనాతో 29 మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కి చేరింది. ఇప్పటివరకు, 4,42,92,854 మంది కరోనా నుంచి కోలుకున్నారు, రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా నమోదైంది. వారంవారీ సానుకూలత రేటు 5.43 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News