Friday, November 22, 2024

9 నెలల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

10126 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరి 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెలువరించింది. సోమవారం10,85,848 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 10,126 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గాయి. అలాగే కేరళ, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కేసుల పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది ప్రారంభం నుంచి దేశంలో 3.43 కోట్ల మందికి కరోనా సోకింది.వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు.

సోమవారం ఒక్క రోజే 11,982 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్ఠానికి చేరింది. దాంతో క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.25 శాతానికి పెరిగింది. కేరళ గణాంకాలను సవరిస్తుండడంతో మరణాల సంఖ్య భారీగా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా 332 మరణాలు నమోదు కాగా, అందులో 262 కేరళవే. ఇప్పటివరకు 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారు. మరో వైపు సోమవారం 59 లక్షల మందికి పైగా టీకా డోసులు అందాయి. ఇప్పటివరకు ఈ సంఖ్య 109 కోట్ల మార్కును దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News